కారును పోలిన గుర్తులు తొలగించిన ఈసీ : టీఆర్ఎస్ కి ఊరట

  • Published By: chvmurthy ,Published On : February 26, 2019 / 12:27 PM IST
కారును పోలిన గుర్తులు తొలగించిన ఈసీ : టీఆర్ఎస్ కి ఊరట

Updated On : February 26, 2019 / 12:27 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన ట్రక్కు, ఇస్త్రీ పెట్టెల ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు  కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వచ్చాయని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ చెప్పారు.  

2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తుల వల్ల కొన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్ధులు అపజయం పాలయ్యారు. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన మరో 4 గుర్తులను తొలగించాలని  కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. టీఆర్ఎస్ అభ్యర్ధన మేరకు కారును పోలిన ట్రక్కు, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం  తెలిపింది. 
Also Read :అభ్యర్ధుల ఎంపిక : టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం