టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లకు ఈసీ ఆమోదం

  • Published By: vamsi ,Published On : March 25, 2019 / 03:45 AM IST
టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లకు ఈసీ ఆమోదం

Updated On : March 25, 2019 / 3:45 AM IST

తెలంగాణ రాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో స్టార్‌ క్యాంపెయినర్లుగా మూడు పార్టీల నుంచి 62 మంది పేర్లకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అధికార తెరాస నుంచి 20 మంది జాబితాను ఆ పార్టీ ఎన్నికల సంఘానికి పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, రాష్ట్ర క్యాబినెట్‌లోని 11 మంది మంత్రులు, సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు జె.సంతోష్‌కుమార్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, టి.రవీందర్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్లను ఎన్నికల సంఘానికి పంపింది. అయితే టీఆర్‌ఎస్‌ జాబితాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పేరు లేదు. మరోవైపు మజ్లిస్‌ పార్టీ నుంచి స్టార్‌ క్యాంపెయినర్లుగా అసదుద్దీన్‌ ఓవైసీ, అక్బరుద్దీన్‌ ఓవైసీలు మాత్రమే ఉన్నారు. 
Read Also : పవన్‌కు పృథ్వీ వార్నింగ్: పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు