రూ. 35 లక్షల ఆస్తి నష్టం : ఆసీఫ్ నగర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రెండు వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆసీఫ్ నగర్‌లో మూడంతస్తులున్న ఓ ఫర్నీచర్ గౌడోన్‌లో మంటలు అంటుకున్నాయి. శుక్రవారం ఉదయం 6.30గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అగ్నిమాపక శకటలతో అక్కడకు చేరుకున్నారు.
అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగలు అలుముకున్నాయి. స్థానికంగా ఉన్న వారు ఇబ్బందులు పడ్డారు. 5 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. మూడు గంటల తరువాత మంటలు అదుపులోకి వచ్చాయి. మొదటి, రెండంతస్తులో ఉన్న ఫర్నీచర్ కాలిపోయింది. రూ. 35 లక్షల మేర ఆస్తినష్టం కలిగినట్లు అంచనా వేస్తున్నట్లు ఫైర్ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.