TV9 సీఈవో రవిప్రకాష్ పై ఫోర్జరీ కంప్లయింట్ : ఇంట్లో పోలీసుల సోదాలు
వాటితోపాటు భారీ ఎత్తున నిధులు కూడా దారి మళ్లించినట్లు కూడా కంప్లయింట్ చేశారాయన. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లయిట్ ఫైల్ అయ్యింది.

వాటితోపాటు భారీ ఎత్తున నిధులు కూడా దారి మళ్లించినట్లు కూడా కంప్లయింట్ చేశారాయన. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లయిట్ ఫైల్ అయ్యింది.
టీవీ9 సీఈవో రవిప్రకాష్ ఇంట్లో తనిఖీ చేస్తున్నారు పోలీసులు. TV9 కార్యాలయంలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారంటూ అలందా మీడియా సెక్రటరీ కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. నిధులను దారి మళ్లించారని కూడా కంప్లయింట్ లో రాశారు. అదే విధంగా TV9 కార్యాలయం నుంచి కొన్ని ఫైళ్లు, ల్యాప్‌ట్యాప్‌లను రవిప్రకాష్ అనుచరులు మాయం చేసినట్లు కూడా గుర్తించారు పోలీసులు. రవిప్రకాశ్, ఆయన అనుచరుల కోసం గాలిస్తున్నారు.
ఇటీవలే TV9 యాజమాన్యం చేతులు మారింది. శ్రీనిరాజు నుంచి 90శాతం వాటాను అలందా మీడియా కొనుగోలు చేసింది. ఆ తర్వాతే టీవీ9 ఆఫీస్ నుంచి అనధికారికంగా నిధులు దారి మళ్లించినట్లు అలందా మీడియా సెక్రటరీ కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి టీవీ ఆఫీస్ నుంచే ఫైళ్లు, ల్యాప్ టాప్ హార్డ్ డిస్క్ లను రవిప్రకాష్ అనుచరులు మాయం చేసినట్లు కంప్లయింట్ చేశారు కౌశిక్ రావు. వాటితోపాటు భారీ ఎత్తున నిధులు కూడా దారి మళ్లించినట్లు కూడా కంప్లయింట్ చేశారాయన. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లయిట్ ఫైల్ అయ్యింది. ప్రస్తుతం రవి ప్రకాష్ అందుబాటులో లేరు. ఆయన కోసం, ఫైళ్లు మాయం చేసిన అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. టీవీ9 ఆఫీసు, రవిప్రకాష్ ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు పోలీసులు.
టీవీ9 సంస్థను అలందా మీడియా కొనుగోలు చేసిన తర్వాత.. కొత్త డైరెక్టర్ల నియామకం కోసం కేంద్ర సమాచారం శాఖ అనుమతి ఇచ్చినా.. సీఈవో రవిప్రకాష్ అడ్డుపడుతూ వచ్చారు. టీవీ9 యాజమాన్యం మార్పును అడ్డుకుంటున్నారనే అలందా మీడియా అంటోంది.