ఒకే కాన్పులో నలుగురు పిల్లలు: అందరూ క్షేమం

ప్రసవం స్త్రీ మరో జన్మలాంటిది. తొమ్మిది మాసాలు బిడ్డను కడుపులో మోయటం తల్లికి బరువు కాదు..ఇద్దర్ని మోయటం కూడా ఇబ్బంది కాదు. కానీ ఏకంగా నలుగురు బిడ్డల్ని మోయటం..వారికి జన్మనివ్వటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అటువంటి అరుదైన సందర్భం హైదరాబాద్ లోని విద్యానగర్‌లోని నియోబీబీసీ ఆసుపత్రిలో జరిగింది.
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు
హైదరాబాద్ కు చెందిన హేమలత అనే 23 ఏళ్ల మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనించ్చింది. వీరిలో ఇద్దరు మగశిశువులు, ఇద్దరు ఆడ శిశువులు. రంగారెడ్డి జిల్లా వెంకటాపూర్‌కి చెందిన హేమలత గర్భం ధరించిన మూడో నెల స్కానింగ్‌లో నలుగురు పిల్లలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఏడు నెలలు నిండిన తరువాత డెలివరీ చేస్తే మంచిదని వైద్యులు చెప్పడంతో హేమలత దంపతులు ఒప్పుకున్నారు. దీంతో ఏప్రిల్ 2న సిజేరియన్ చేసి నలుగురు బిడ్డలను బయటికి తీశారు.
నెలలు నిండకముందే జన్మించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం విద్యానగర్‌లోని నియో బీబీసీ న్యూబార్న్ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు. పుట్టిన సమయంలో కేవలం వెయ్యిగ్రాముల బరువున్న శిశువులకు వైద్యులు చికిత్సనందించారు. దీంతో ప్రస్తుతం నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్స్ తెలిపారు. బిడ్డలంతా ఆరోగ్యంగా ఉండటంతోపాటు తల్లిపాలు తాగుతున్నారని తెలిపారు.ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టి తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉండటం అనేది చాలాఅరుదని, ఏడెనిమిది లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని చెప్పారు.
Also Read : ఉద్యోగ సమాచారం : CCIలో 19 పోస్టులు