బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సమగ్ర రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులో మరొక ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. గచ్చిబౌలి బయోడైవర్సీటి వద్ద నిర్మించిన భారీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, జిహెచ్ఎంసి మేయర్ బోంతు రామ్మెహన్‌లతో పాటు సబిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
SRDP ప్రాజెక్టులో ఇప్పటికే మూడు అండర్ పాస్‌లు, నాలుగు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రాగా… మరొక ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులోకి వస్తుంది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే తెలంగాణ ప్రభుత్వం రూ.69.47కోట్లతో నగరంలోనే ఎత్తైన ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.
ఖాజాగూడ నుంచి మైండ్ స్పేస్ వైపు వెళ్లే వాహనదారులకు ఇక ట్రాఫిక్ సమస్యలు తీరినట్టే అని భావిస్తున్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా బయోడైవర్సిటీ జంక్షన్‌లో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టారు. భూ సేకరణలో సమస్యల వల్ల కొంత ఆలస్యమైంది. ఇటీవలే భూ సేకరణకు మార్గం సుగమం కావడంతో త్వరలోనే మొదటి లెవల్ ఫ్లై ఓవర్ కూడా పూర్తవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.