GHMC ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల

GHMC ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల

Updated On : November 16, 2020 / 10:32 AM IST

రాబోయే ఎన్నికల సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది జీహెచ్‌ఎంసీ. ఈ లిస్ట్‌ను లోకల్ సర్కిల్‌, వార్డు, తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో అధికారులు డిస్ ప్లే చేశారు. 150 డివిజన్ల పరిధిలో మొత్తం 74లక్షల 4వేల286 ఓటర్లు ఉన్నారు.

పురుషులు 38లక్షల 56వేల 770 (52.09 శాతం) ఉండగా మహిళలు 35లక్షల 46వేల 847 (47.90శాతం)మంది ఇతరులు (ట్రాన్స్‌జెండర్‌లు) 669లుగా ఉన్నట్లు స్పష్టమైంది. 79వేల290 ఓటర్లతో అత్యధిక ఓటర్లు కలిగిన డివిజన్‌గా మైలార్‌దేవ్‌పల్లిలో ఉండగా, అత్యల్పంగా 27వేల 998 ఓటర్లతో రామచంద్రాపురంలో ఉన్నారు.



పురుషులతో పోల్చితే మహిళలు ఎక్కువగా ఉన్న డివిజన్‌గా బన్సీలాల్‌పేటగా నిలిచింది. ఇక్కడ మహిళలు 31వేల 255 మంది ఉంటే.. పురుషులు 30వేల 707 మంది మాత్రమే ఉన్నారు. రెండో స్థానంలో అడ్డగుట్టలో 24వేల 655 మహిళా ఓటర్లు ఉన్నారు. ఫతేనగర్‌లో ట్రాన్స్‌జెండర్లు 47 మంది ఉన్నట్లు తేల్చారు.
https://10tv.in/ghmc-election-voter-list/
ఓటర్లు ఫైనల్ లిస్ట్‌లో పేర్లను పరిశీలించుకుని, లేనిపక్షంలో ఫామ్‌-6ను పూరించి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యేనాటికి దరఖాస్తు చేసుకోవాలని గ్రేటర్‌ ఎన్నికల అథారిటీ, GHMC కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ వెల్లడించారు. అంతేకాక రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ www.tsec.gov.inలో ఓటర్ల ఫైనల్ లిస్టును ఉంచారు.