నోరూరుతోందా :రంజాన్ కు ముందే హలీమ్ ఘుమ ఘుమలు 

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 09:23 AM IST
నోరూరుతోందా :రంజాన్ కు ముందే హలీమ్ ఘుమ ఘుమలు 

Updated On : April 23, 2019 / 9:23 AM IST

హలీమ్ ఈ పేరు చెబితేనే చాలు నోరూరిపోతుంది. మరి హలీమ్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పండుగ రంజాన్. రంజాన్ మాసం వచ్చిదంటే చాలు హైదరాబాద్ నగరం అంతా హలీం వాసనలు ఘుమ ఘుమలాడిపోతాయి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం హలీమ్ తో ఉపవాసాన్ని ముగిస్తారు ముస్లిం సోదరులు. ఈ ఏడాది మే 5వ తేదీన రంజాన్ మాసం ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో రంజాన్ పండుగకు ఇంకా 15రోజులు ఉంది. కానీ అప్పుడే నగరంలో హలీం విక్రయాలు ప్రారంభమైపోయాయి. 

ఇప్పటికే పలు  హోటళ్లలో ఘుమఘుమలాడించే హలీం రెడీ రెడీ అయిపోయింది. రారామ్మని.. హలీం ప్రియులను ఆహ్వానిస్తోంది. మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, పాతబస్తీ వంటి ప్రాంతాలలో హలీం తయారు చేస్తు విక్రయాలు జోరందుకున్నారు. గత రెండేళ్లుగా రంజాన్‌ పండుగ వేసవికాలంలోనే రావటం విశేషం. 

శరీరాన్నికి బలాన్ని హలీమ్ 
హలీం తయారీలో అన్నీ బలవర్థకమైన పదార్ధాలనే వినియోగిస్తారు. గోధుమలు, మటన్, లేదా చికెన్ లతో పాటు జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్, పలు రకాల మసాల దినుసులు  హలీమ్ లో వాడతారు. అయితే వేసవి దృష్ట్యా మసాల దినుసులు తక్కువగా వాడుతున్నట్లు హలీమ్ తయారీదారులు తెలిపారు.