మీ జేబు నుంచి రూ.5లక్షలు ఇవ్వాల్సిందే : డెంగీ మరణాలపై ఐఏఎస్ లకు హైకోర్టు హెచ్చరిక

తెలంగాణలో డెంగీ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం.. డెంగీ నివారణకు

  • Published By: veegamteam ,Published On : October 24, 2019 / 03:16 PM IST
మీ జేబు నుంచి రూ.5లక్షలు ఇవ్వాల్సిందే : డెంగీ మరణాలపై ఐఏఎస్ లకు హైకోర్టు హెచ్చరిక

Updated On : October 24, 2019 / 3:16 PM IST

తెలంగాణలో డెంగీ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం.. డెంగీ నివారణకు

తెలంగాణలో డెంగీ మరణాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులు చచ్చిపోతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం.. డెంగీ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. డెంగీ మరణాలు ఎందుకు నమోదయ్యాయని కోర్టు ప్రశ్నించింది. సీఎస్ మాటలు.. వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని, ఉన్నతాధికారులు మూసీని సందర్శించాలని ఆదేశించింది.

ప్రణాళికలన్నీ పేపర్లపైనే ఉన్నాయి కానీ వాస్తవరూపం లేవని అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు‌. మూసీ పక్కనున్న హైకోర్టులోనే విపరీతమైన దోమలున్నాయని వాపోయింది. జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే అక్టోబర్ నాటికి 3వేల 800 కు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంకను మోడ్రన్ గా తీసుకొని నివారణ చర్యలు ప్రారంభించాలని హైకోర్టు చెప్పింది. డెంగీ వ్యాధి నివారణలో ప్రభుత్వం విఫలమైతే కలెక్టర్లూ కోర్టుకు హాజరు కావాల్సింది ఉంటుందని ధర్మాసనం చెప్పింది.

దోమలు, డెంగీ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించకోక పోతే ఐఏఎస్ లపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామన్న హైకోర్టు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా మరణిస్తే.. ఐఏఎస్ లదే బాధ్యతని చెప్పింది. మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు.. ఐఏఎస్ లే తమ సొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైకోర్టు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కోర్టులో సీఎస్ జోషి, మిగతా అధికారులు సైలెంట్ గా ఉండిపోయారు.