అందరికీ కాదు : మార్చి 8న సెలవు

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 04:27 AM IST
అందరికీ కాదు : మార్చి 8న సెలవు

Updated On : March 6, 2019 / 4:27 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఉద్యోగినులకు సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజున స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌గా పరిగణించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగినులకు సెలవు దినంగా ప్రకటిస్తూ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2010 ఆగస్టు 4న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Also Read : ముంచేశాడు : మలేషియాలో ఉద్యోగాల పేరుతో మోసం

ఈ ఉత్తర్వులను పలువురు అధికారులు పాటించడం లేదంటూ తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం మరోమారు ఉత్తర్వులు జారీ చేసింది.