హైదరాబాద్‌ పరిధిలో 11మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

హైదరాబాద్‌ పరిధిలో 11మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

Updated On : February 16, 2019 / 5:43 AM IST

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 11మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర వారి పదవులు, ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి. తప్పచబుత్ర ఇన్‌స్పెక్టర్‌గా టి. అకోశ్ కుమార్, సీసీఎస్‌కు ఎన్.ఆనంద్, చత్రినాక డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా కే.నవీన్ కుమార్,  అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్‌గా టి. రాజశేఖర్ రెడ్డిలు మారారు. 

అధికారుల ఆదేశాల మేరకు టి.మురళీ కృష్ణ, మాదన్నపేట్ ఇన్‌స్పెక్టర్‌గా ఎన్.సైదులు, సైదాబాద్ ఇన్‌స్పెక్టర్‌గా కేవీఎల్ నరసింహ రావు. మిగిలిన ఇన్‌స్పెక్టర్‌లుగా ఎన్. మోహన్ రావు సీసీఎస్‌కు, నాంపల్లి ఎడిషనల్ ఇన్‌స్పెక్టర్‌గా భూపతి, ఆసిఫ్ నగర్ ఎడిషనల్ ఇన్‌స్పెక్టర్‌గా వి.లచ్చీరామ్, తుకారం గేట్ ఎడిషనల్ ఇన్‌స్పెక్టర్‌గా పి. మధుసూదన్ రెడ్డిలు బదిలీ అయ్యారు.