హైదరాబాద్: ఆకాశంలో ఈ-బస్సులు!!

హైదరాబాద్ నగరానికి మణిహారంగా మారిన మెట్రోకు అనుసంధానంగా ఆకాశమార్గంలో ఎలక్ట్రికల్ బస్సులు పరిగెత్తనున్నాయి. ఐటీ కారిడార్ లో ఎలివేటెడ్ బస్రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటే బస్సులు మాత్రమే రాకపోకలు సాగించే ఆకాశ మార్గం (ఈబీఆర్‌టీఎస్) రాబోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకు కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి నానక్‌రామ్ గూడా జంక్షన్దగ్గర ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ తో అనుసంధానం కానుంది. దీని కోసం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీని కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక కోసం సర్వేలు చేపట్టారు.
దీని కోసం గత రెండు రోజులుగా హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో టెక్నికల్ టీమ్ కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు ఉన్న కారిడార్‌ను పరిశీలించింది. అనంతరం బేగంపేటలోని మెట్రో భవన్‌లో ఐటీ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో చర్చలు జరిపారు.
ఐటీ కారిడార్లలో పెరుగుతున్న డెవలప్ మెంట్..పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో ఈ కొత్త ఈ- బస్సులతో ప్రయాణ సమయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. దీంతో ఈబీఆర్‌టీఎస్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈబీఆర్‌టీఎస్ సిస్టంపై నగరవాసులకు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈబీఆర్‌టీఎస్ను మెట్రో కారిడార్-1లోని కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి జేఎన్‌టీయూ, ఫోరం మాల్ రోడ్, మలేషియా టౌన్‌షిప్, హైటెక్స్, ఎన్‌ఏసీ, సీఐఐ టెక్ మహీంద్రా రోడ్, రాయదుర్గం, ఐఎ్‌సబీ రోడ్, విప్రో జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోని నానక్‌రామ్‌గూడ జంక్షన్ వరకు పరిశీలించారు. 17కిలోమీటర్ల మేర ఉండే ఈబీఆర్‌టీఎస్ ప్రాజెక్టుకు మల్టీమోడల్ కనెక్టివిటీ ఉంటుంది. కారిడార్-1లోని కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌కు, కారిడార్-3లోని రాయదుర్గం మెట్రోస్టేషన్‌కు, హైటెక్‌సిటీలోని ఎంఎంటీఎస్ స్టేషన్‌కు. శంషాబాద్ విమానశ్రయానికి వెళ్ళే నానక్‌రామ్‌గూడలోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఈబీఆర్‌టీఎస్ అనుసంధానం చేస్తారు.
ఈబీఆర్‌టీఎస్ దాదాపుగా మెట్రోరైలు విధానం మాదిరిగానే ఉంటుందని, ఎలివేటెడ్ కారిడార్‌పై ప్రస్తుతం మెట్రో రైళ్లు వెళ్తుండగా, ఈబీఆర్‌టీఎస్‌లో ఎలక్ర్టికల్ బస్సులు ప్రయాణించేందుకు అన్ని విధాల ప్రతిపాదనలకు అధికారులు పరిశీలిస్తున్నారు. మెట్రో ప్రాజెక్టు కంటే ఈబీఆర్‌టీఎస్ ప్రాజెక్టుకు తక్కువ ఖర్చు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈబీఆర్‌టీఎస్ ప్రాజెక్టు స్టేషన్ల కోసం స్థలాలను ఇచ్చేందుకు ఆయా యజమానులు సానుకూలంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.