భార్య, కొడుకుని హత్య చేసి..ఆత్మహత్యాయత్నం..

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 07:11 AM IST
భార్య, కొడుకుని హత్య చేసి..ఆత్మహత్యాయత్నం..

Updated On : December 11, 2019 / 7:11 AM IST

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని గోపన్నపల్లిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో దారుణం జరిగింది. అనంతప్పా అలియాస్ చిన్నా అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. భార్యకు ఉరేసి చంపి..కుమారుడి ఊపిరాడకుండా చేసి నరికి  చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

కర్ణాటకలోని హుబ్లి నుంచి వలస వచ్చిన అనంతప్పా అలియాస్ చిన్నా భార్య మాధవి..సంవత్సరంన్నర వయస్సున్న కొడుకుతో కలిసి ఎన్టీఆర్ నగర్ లో అద్దెకు ఉంటున్నారు. వీరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఈ క్రమంలో బుధవారం (డిసెంబర్ 11) తెల్లవారుఝామున చిన్నా భార్య మాధవిని, కొడుకును హత్య చేశారు. తరువాత తాను కూడా ఆత్మహత్యకు యత్నించే క్రమంలో స్థానికుల సమాచారంతో అప్పుడే వచ్చిన పోలీసులు చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చసుకుని దర్యాప్తు చేపట్టారు.