మెట్రో జోష్ : స్టేషన్ టూ స్టేషన్ ట్రిప్ పాస్ లు

నగరానికి మణిహారంలాంటి మెట్రో రైళ్లకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. త్వరలోనే ‘స్టేషన్ టు స్టేషన్ ట్రిప్’ పేరిట త్వరలనే పాస్‌లు ప్రవేశపెట్టబోతున్నట్లు L&TMRHL MD కేవీబీ రెడ్డి వెల్లడించారు. హైటెక్ సిటీ మార్గంలో నడుస్తున్న మెట్రో రైళ్లకు జనాలు క్యూ కడుతున్నారు. ప్రతి రోజు1.80 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ సంఖ్య ఇప్పుడు 2.20 లక్షల మందికి చేరుకుంది. మార్చి 20వ తేదీన అమీర్ పేట – హైటెక్ సిటీకి మెట్రో రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనికి ప్రజల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆఫీసు వేళ్లలో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.
Read Also : నాకు బతకడమే ఓ కల : 28న ఐరా
HMRL అధికారులు IT, ITES కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 40 మంది కంపెనీ ప్రతినిధులు, HMRL నుంచి మేనేజింగ్ డైరెక్టర్, ఎన్వీఎస్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. మెట్రో స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. LB నగర్, దిల్ సుఖ్ నగర్, నాగోల్, ఉప్పల్, మియాపూర్ ప్రాంతాల్లోని కాలనీల్లో నివాసం ఉంటున్న ఉద్యోగులకు మెరుగైన సౌకర్యమన్నారు.
చాలా స్టేషన్లలో పార్కింగ్ విషయంలో ఉన్న సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు మెట్రో అధికారులు. దుర్గంచెరువు, హైటెక్ సిటీ, మాదాపూర్ స్టేషన్లలో కూర్చొనే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. అలాగే పార్కింగ్ స్థలం కోసం కంపెనీలు స్థలం కేటాయించాలని కోరారు. ‘స్టేషన్ టు స్టేషన్ ట్రిప్’ పేరిట త్వరలనే పాస్‌లు ప్రవేశపెట్టబోతున్నట్లు L&TMRHL MD కేవీబీ రెడ్డి వెల్లడించారు.
Read Also : నేటితో APECET-2019 దరఖాస్తుకు ఆఖరు