దిశ కేసులో కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ : ఫాస్ట్ ట్రాక్ కోర్టు దిశగా చర్యలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 09:20 AM IST
దిశ కేసులో కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ : ఫాస్ట్ ట్రాక్ కోర్టు దిశగా చర్యలు

Updated On : December 4, 2019 / 9:20 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసుని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో నిందితులను వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం చర్యలు చేపట్టింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకి లేఖ రాసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరింది. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు కోసం ప్రభుత్వం తరఫున న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి హైకోర్టుకి లేఖ రాశారు. సాయంత్రంలోగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుపై హైకోర్టు నిర్ణయం తెలపనుందని సమాచారం.

వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దిశ నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దిశ నిందితులు ప్రస్తుతం చర్లపల్లిలో జైల్లో ఉన్నారు. అటు దిశ నిందితుల కస్టడీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిందితుల భద్రతపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కస్టడీకి ఇస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అఫెన్స్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంది. నిందితులను మాకు వదిలేయండి, చంపేస్తామంటూ ప్రజలు ఆందోళనలు చేస్తుండడంతో వారి భద్రత ఎలా అని పోలీసుల టెన్షన్ పడుతున్నారు. చర్లపల్లి జైలు దగ్గర టెన్షన్ వాతావరణం ఉంది.

బుధవారం(డిసెంబర్ 4,2019) రాత్రి వరకు నిందితులను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కస్టడీకి ఇస్తే… కోర్టులోనే ఐడెంటిటీ పరేడ్ నిర్వహించి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉందని సమాచారం. హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ దగ్గర వెటర్నరీ డాక్టర్ దిశ.. నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురి కావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి.. తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందో రాదో అని కంగారు పడుతున్నారు.