సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దు

సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దు

Updated On : October 17, 2019 / 9:20 AM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైన వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు కావాల్సి వచ్చింది. సభకు వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ నుంచి అనుమతి దొరకలేదు. రోడ్డు మార్గంలో ఉరుములు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటన రద్దు అయినట్లుగా మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.