48గంటల తర్వాత : కళ్లు తెరిచిన మధులిక
హైదరాబాద్: 48గంటల వైద్యం ఫలించింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక(17) కళ్లు తెరిచి చూసిందని

హైదరాబాద్: 48గంటల వైద్యం ఫలించింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక(17) కళ్లు తెరిచి చూసిందని
హైదరాబాద్: 48గంటల వైద్యం ఫలించింది. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక(17) కళ్లు తెరిచి చూసిందని వైద్యులు చెప్పారు. వైద్యానికి మధులిక శరీరం సహకరిస్తోందని డాక్టర్లు తెలిపారు. దాడి జరిగినప్పటి నుంచి మధులిక స్పృహలో లేదు. శ్వాస తీసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, మధులికకు మైనర్ ఆపరేషన్‌తోపాటు.. ప్లాస్టిక్ సర్జరీ చేశారు వైద్యులు. ఐదుగురు వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
2019 ఫిబ్రవరి 6వ తేదీ బుధవారం ఉదయం బర్కత్‌పురలో కాలేజీకి వెళుతున్న సమయంలో మధులికపై భరత్ అటాక్ చేశాడు. కొబ్బరిబోండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. మధులిక శరీరంపై 14 బలమైన కత్తి పోట్లు ఉన్నాయి. బాధితురాలి పుర్రె రెండుగా చీలిందని, మెదడులోని కీలక నరాలు తెగిపోయాయని వైద్యులు తెలిపారు. మెడ, దవడ, రెండు చేతుల మణికట్లపై 2 సెంటీమీటర్ల మేర గాయాలు ఉన్నాయని, ఎడమ చేతి వేలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. రక్తస్రావం ఆగి, బీపీ, పల్స్‌రేట్.. సాధారణ పరిస్థితికి వచ్చిన తర్వాతే ఆమెకు మేజర్ సర్జరీ చేస్తామన్నారు.