సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కశ్మీర్ కు సైనిక బలగాల తరలింపు!

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కశ్మీర్ కు భారీస్థాయిలో భద్రతా బలగాలను తరలించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మూడు రోజులుగా భద్రతా బలగాలను విమానాల్లో, రోడు మార్గం ద్వారా పంపినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
అయితే అధికారులు దీనిపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. బలగాల రాకపోకలు సహజమేనని, అందులో ప్రత్యేకత ఏమీ లేదని చెబుతూనే దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై మాట్లాడబోమని చెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు క్రమంలో ఇదివరకే హైదరాబాద్ నుంచి భారీస్థాయిలో సీఆర్ పీఎఫ్ బలగాలు కశ్మీర్ కు తరలివెళ్లాయి. ఇప్పుడు సైన్యాన్ని అక్కడికి పంపించారు.