షో రెడీ : తెలంగాణ బస్టాండ్లలో మినీ థియేటర్లు

బస్టాండ్లలో బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూసే ప్రయాణికులకు గుడ్ న్యూస్. బస్సు కోసం ఎక్కువ సమయం వేచి ఉండే ప్రయాణీకులకు బోర్ కొట్టకుండా బస్ స్టేషన్లలో  తమ ప్రాంగణాల్లో వినోదాన్ని అందించేందుకు మినీ థియేటర్లు నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 06:49 AM IST
షో రెడీ : తెలంగాణ బస్టాండ్లలో మినీ థియేటర్లు

Updated On : January 25, 2019 / 6:49 AM IST

బస్టాండ్లలో బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూసే ప్రయాణికులకు గుడ్ న్యూస్. బస్సు కోసం ఎక్కువ సమయం వేచి ఉండే ప్రయాణీకులకు బోర్ కొట్టకుండా బస్ స్టేషన్లలో 
తమ ప్రాంగణాల్లో వినోదాన్ని అందించేందుకు మినీ థియేటర్లు నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం – తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్లలో మినీ సినిమా ధియేటర్ల ఏర్పాటుకి అడుగు పడింది. దీని కోసం ఆర్టీసీకి చెందిన 23 ప్రాంతాలను గుర్తించారు. వీటిలో 15 మినీ థియేటర్లు నిర్మించేందుకు TFDC (తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) సిద్ధంగా ఉన్నట్లు ఎండీ సునీల్‌ శర్మ ప్రకటించారు. ఈ థియేటర్ల ద్వారా ఏడాదికి 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని అంచనా.

ఈ బస్టాండ్లలో మినీ థియేటర్లు :

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొల్లూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, ధర్మపురి, హుజూరాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, జడ్చర్ల, షాద్‌నగర్, నర్సాపూర్, సంగారెడ్డి, నాగార్జునసాగర్, కోదాడ, వికారాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్‌ బస్టాండ్లలో మినీ థియేటర్లు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కనున్నట్లు తెలిపారు అధికారులు.ఇప్పటికే బెజవాడ బస్టాండ్‌లో మినీథియేటర్‌ నడుస్తోంది. అక్కడి నిర్వహణ పని తీరు పరిశీలించేందుకు త్వరలోనే ఈడీ పురుషోత్తమ్‌ ఆధ్వర్యంలోని బృందం విజయవాడ వెళ్లి పరిశీలించనుంది.

రిలాక్స్ వెయిటింగ్ :

బస్టాండ్లలో బస్సుల కోసం వెయిట్ చేసే వారు ఈ మినీ థియేటర్లలో రిలాక్స్ కావొచ్చు. టికెట్ ధర కూడా తక్కువగానే ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు, ఇతర ప్రాంతాల నుంచి బస్టాండ్లకు వచ్చి వెయిట్ చేసే వారికి ఇది ఎంతో ఉపయోగంగా ఉండనుంది. ఆర్టీసీ ప్రతిపాదనకు.. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (TFDC) అంగీకారం తెలపటంతో.. త్వరలోనే పనులు మొదలుకానున్నాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది ఆదాయ మార్గంగా కూడా ఉండనుంది.