Kalvakuntla Taraka Rama Rao on Procurement: తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని వెక్కిరించారు.. ఇప్పుడు మీరు తింటారా?: కేటీఆర్

రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయాలని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం గొప్పలు చెప్పుకుందని, దేశంలో నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని పేర్కొందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు బియ్యం ఎగుమతులను నియంత్రిస్తోందని, 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందని చెప్పారు. ఇంతకుముందే గోధుమలు, గోధుమల ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిందని, ఇప్పుడు నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల అవసరాలపై అవగాహన లేదని చెప్పారు.

Kalvakuntla Taraka Rama Rao on Procurement: తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని వెక్కిరించారు.. ఇప్పుడు మీరు తింటారా?: కేటీఆర్

Kalvakuntla Taraka Rama Rao on Procurement

Updated On : September 10, 2022 / 7:35 PM IST

Kalvakuntla Taraka Rama Rao on Procurement: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని వెక్కిరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ ఇప్పుడు ఆయనే నూకలు తింటారేమో అని మంత్రి కేటీఆర్ అన్నారు. నూకల ఎగుమతులను నిషేధించే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందని విమర్శించారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని, అందుకు కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలే కారణమని ఆయన అన్నారు.

మోదీ సర్కారుకు ముందు చూపు లేదని, వివక్షాపూరిత ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం ధాన్యాలను కొనుగోలుచేయకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం చూపే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడిందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ‘ఒకే దేశం ఒకే విధమైన కొనుగోలు’ విధానాన్ని అనుసరించాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల క్రితం గొప్పలు చెప్పుకుందని, దేశంలో నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని పేర్కొందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు బియ్యం ఎగుమతులను నియంత్రిస్తోందని, 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందని చెప్పారు. ఇంతకుముందే గోధుమలు, గోధుమల ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిందని, ఇప్పుడు నూకల ఎగుమతిపైనా నిషేధం విధించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల అవసరాలపై అవగాహన లేదని చెప్పారు.

EetelaRajender slams KCR: ఇలాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి నాయకత్వం వహిస్తానంటున్నారు: ఈటల