విద్యార్థులను ఆదుకోండి : అమెరికా కాన్సులేట్ జనరల్‌తో కేటీఆర్

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 02:32 AM IST
విద్యార్థులను ఆదుకోండి : అమెరికా కాన్సులేట్ జనరల్‌తో కేటీఆర్

Updated On : February 2, 2019 / 2:32 AM IST

హైదరాబాద్ : అమెరికాలో సంక్షోభంలో చిక్కుకున్న తెలుగు స్టూడెంట్స్‌ని రక్షించేందుకు టి.సర్కార్ చర్యలు చేపడుతోంది. విద్యార్థులను రిలీజ్ చేసే విధంగా చూడాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డ ప్రగతి భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా…అమెరికా యూనివర్సిటీల్లో అక్రమంగా అడ్మిషన్ పొందిన తెలుగు విద్యార్థుల అరెస్టు వీరి మధ్య చర్చకు వచ్చింది. విద్యార్థులను విడుదల చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కేటీఆర్…హడ్డాను కోరారు.

యూ ఎస్ ఇమ్మిగ్రేగషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పలువురు విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ఉద్యోగులుగా నటిస్తూ…అక్రమంగా అడ్మిషన్లు పొందిన వారిపై అక్కడి అధికారులు నజర్ పెట్టారు. అరెస్టయిన విద్యార్థుల్లో 14 మంది తెలుగువారున్నట్లు టాక్. వీరిని విడిపించేందుకు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.