గ్రీన్ ఛాలెంజ్‌ : మొక్కలు నాటిన ‘మై హోమ్ గ్రూప్’ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు 

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 05:13 AM IST
గ్రీన్ ఛాలెంజ్‌ : మొక్కలు నాటిన ‘మై హోమ్ గ్రూప్’ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు 

Updated On : November 7, 2019 / 5:13 AM IST

దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఒక ఉద్యమంగా మారింది ఈ గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమం. పచ్చదనం పెంపొందించటమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉద్యమంలా మారిపోయింది.

గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఒకరు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి సవాల్ విసరాలి. ఆ ముగ్గురు మూడు మొక్కల చొప్పున నాటి మరో ముగ్గురికి సవాల్ విసరాలి. అక్టోబర్‌లో మొదలైన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ఇప్పుడు ఉద్యమంలా కొనసాగుతోంది.

ఈ క్రమంలో తెలంగాణ రిజిస్ట్రేషన్స్ స్టాంపుల డిపార్ట్‌మెంట్ కమిషనర్, ఐజీ చిరంజీవులు విసిరినన గ్రీన్ చాలెంజ్‌ను హై హోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర రావు స్వీకరించారు. బుధవారం (నవంబర్ 6)న హైటెక్ సిటీలోని మై హోమ్ కన్‌స్ట్రక్షన్ ప్రాంగణంలో జూపల్లి రామేశ్వర రావు మొక్కలు నాటారు.

అనంతరం గ్రీన్ చాలెంజ్‌ను మరో ముగ్గురుకి పాస్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, చిత్ర దర్శకులు వంశీ పైడిపల్లి, టివీ9 సీఓఓ గొట్టిపాటి సింగారావులకు ఈ గ్రీన్ చాలెంజ్‌ను పాస్ చేశారు రామేశ్వరరావు.

ఈ గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలో ఎంతోమంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటూ మొక్కలు నాటుతున్నారు. పచ్చదనం వ్యాప్తి చేయడంలో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్‌కు ప్రచారం కల్పిస్తున్నారు. తన వంతుగా రామేశ్వరరావు కూడా ఈ ఛాలెంజ్‌ని స్వీకరించారు.