నెహ్రూ జూ పార్క్ : పులిని దత్తత తీసుకున్న పిల్లలు 

  • Published By: veegamteam ,Published On : February 21, 2019 / 04:56 AM IST
నెహ్రూ జూ పార్క్ : పులిని దత్తత తీసుకున్న పిల్లలు 

హైదరాబాద్ : సాధారణంగా చిన్నారులు జూకు వెళితే అక్కడ ఉండే జంతువులను చూడి సంబరపడిపోతారు..కేరింతలు కొడతారు..జూపార్క్ లో ఆడుకుని ఆనక ఇంటికొచ్చేస్తారు. కానీ అంతటితో వదిలేయలేదు ఈ చిన్నారులు. అమ్మా నాన్నలు ఇచ్చిన పాకెట్ మనీని దాచుకుని ఓ మంచి పని చేశారు.  హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లోని ఓ పెద్దపులిని దత్తత తీసుకుని తమ పెద్ద మనస్సును చాటు కున్నారు. అందరి ప్రశంసల్ని అందుకున్నారు.  

  
నెహ్రూ జూలాజికల్ పార్కులో మగ వైట్ టైగర్ ను NASR స్కూల్  విద్యార్ధులు దత్తత తీసుకున్నారు. ఫిబ్రవరి 20న స్కూల్ అధికారులతో 100 మంది విద్యార్ధులు నెహ్రూ జులాజికల్ పార్కును సందర్శించారు. అనంతరం తెల్ల పులికి  ఒక సంవత్సరం పాటు అయ్యే ఖర్చు (ఫుడ్)ను  భరిస్తామని తెలిపి రూ. 1లక్ష చెక్ జూ అధికారులకు అందజేశారు. 
 

NASR ఎడ్యుకేషన్ సొసైటీ బేగం అనాస్ ఖాన్, కార్యదర్శి నవాబ్ మీర్ కుతుబుద్దిన్ ఖాన్, పాఠశాల ప్రిన్సిపల్ మీర్ హఫీజుద్దీన్ అహ్మద్ తమ విద్యార్ధులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫోర్త్ నుంచి సెవెంత్ క్లాస్ విద్యార్ధులు సేకరించిన డబ్బును చెక్ రూపంలో జూ అధికారులకు అందజేశారు. జూ సిబ్బందితో తెల్లపులి గురించి విద్యార్ధులు ఆసక్తితో అడిగిన ప్రశ్నలకు జూ అధికారులు సమాధానమిచ్చారు.

పులిని దత్తత తీసుకోవటానికి వన్యప్రాణి పరిరక్షణ కార్యక్రమానికి తమ సపోర్ట్ ను తెలిపినందుకు NASR స్కూల్ స్టూడెంట్స్ కు..స్కూల్ మేనేజ్ మెంట్ కు జూ క్యూరేటర్ క్షితిజ ధన్యవాదాలు తెలిపారు. నెహ్రూ జూలాజికల్ పార్కులో ఎక్కువ మంది ప్రజలు జంతువులను దత్తత తీసుకుంటే మరింతగా జూను డెవలప్ చేస్తామన్నారు.