సీఎం కేసీఆర్ తో ఒవైసీ సోదరులు భేటీ

ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం వారు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో యునైటెడ్

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 08:10 AM IST
సీఎం కేసీఆర్ తో ఒవైసీ సోదరులు భేటీ

Updated On : December 25, 2019 / 8:10 AM IST

ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం వారు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో యునైటెడ్

ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇందుకోసం వారు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారిద్దరి ఆధ్వర్యంలో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సభ్యులు కూడా ప్రగతి భవన్ కు వచ్చారు. వీరంతా సీఎంతో సమావేశం అవుతారు. CAA, NRC, NPR లపై సీఎం కేసీఆర్ తో చర్చించనున్నారు. NPR ను కూడా వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ ని ఒవైసీ సోదరులు కోరే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత మధ్యాహ్నం ప్రగతి భవన్ లోనే.. ముస్లిం యాక్షన్ కమిటీ సభ్యులు భోజనం చేయనున్నారు.

కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ను వ్యతిరేకించాలని.. పూర్తి స్తాయిలో తమకు సహకరించాలని ముస్లిం యాక్షన్ కమిటీ సభ్యులు సీఎంని కోరనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన క్యాబ్ ని ఇదివరకే పార్లమెంటులో టీఆర్ఎస్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్ పీఆర్ ని వ్యతిరేకించాలని ఒవైసీ సీఎం కేసీఆర్ ని కోరనున్నారు.