ప్రియాంక రెడ్డికి న్యాయం చెయ్యాలి.. ప్రజల డిమాండ్.. పోలీసుల లాఠీ చార్జ్

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచారం విషయమై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షాద్‌నగర్ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా.. తగ్గుముఖం పట్టట్లేదు. పరిస్థితి మరింత ఉద్రిక్తం అయ్యింది. ఈ క్రమంలోనే ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు.
ప్రియాంకా రెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థులు, నగర ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిందితులను తమకు అప్పగించాలంటూ నినాదాలు చేస్తూ.. ప్రజా కోర్టులో నిందితులను చంపాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్ఓటీ బలగాలు కూడా మోహరించి ప్రజలను అదుపులోకి తీసుకుని వస్తున్నాయి.
#WeWantJustice నినాదాలతో ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఉరిశిక్ష పడే విధంగా కృషి చేస్తాము అంటూ మైకుల్లో చెప్తున్నారు పోలీసులు. అయినా కూడా ఆందోళనకారులు దిగట్లేదు. డీసీపీ అభ్యర్థించినా ఆందోళన చేస్తున్నారు. నిందితులను వెంటనే ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఇంటి ఆడపడుచుగా ప్రియాంకను భావిస్తున్నారు. చట్టానికి లోబడి పోలీసులు ఏమీ చెయ్యట్లేదని అంటున్నారు.