కిషన్ రెడ్డిపై కోర్టులో కేసు : పిటీషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ కార్యకర్త

  • Published By: chvmurthy ,Published On : April 10, 2019 / 01:25 PM IST
కిషన్ రెడ్డిపై కోర్టులో కేసు : పిటీషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ కార్యకర్త

Updated On : April 10, 2019 / 1:25 PM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కిషన్ రెడ్డిని పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని కోరుతూ బుధవారం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది.  సికింద్రాబాద్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఏజెంట్ పవన్ కుమార్ గౌడ్  ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కిషన్ రెడ్డిపై  క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పిటిషన్ లో కోరారు.

రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం 2లక్షల రూపాయల కన్నా ఎక్కువ విత్ డ్రా చేయడానికి వీలు లేదు, కాని 8కోట్ల రూపాయలు ఒకేసారి విత్ డ్రా చేయడాన్ని పిటిషనర్లు తప్పుపట్టారు. హై కోర్టు శుక్రవారం పిటీషన్ విచారణకు రానుంది.