దూల తీరింది : ఆగుబే అని రాసుకున్నాడు, అనుభవిస్తున్నాడు
హైదరాబాద్ : ఫ్యాషన్ మోజులో యూత్ పిచ్చి పీక్స్‌కు చేరింది. నలుగురిలో స్పెషాలిటీ కోసం అడ్డమైన పనులు చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. తమ బైకుల వెనుక తమకు ఇష్టమైన

హైదరాబాద్ : ఫ్యాషన్ మోజులో యూత్ పిచ్చి పీక్స్‌కు చేరింది. నలుగురిలో స్పెషాలిటీ కోసం అడ్డమైన పనులు చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. తమ బైకుల వెనుక తమకు ఇష్టమైన
హైదరాబాద్ : ఫ్యాషన్ మోజులో యూత్ పిచ్చి పీక్స్‌కు చేరింది. నలుగురిలో స్పెషాలిటీ కోసం అడ్డమైన పనులు చేసి అడ్డంగా బుక్ అవుతున్నారు. తమ కార్లు, బైకుల వెనుక తమకు ఇష్టమైన స్లోగన్స్ రాసుకోవడం కామన్. అందులో ఎలాంటి తప్పులేదు. కానీ ఈ విషయంలో కొందరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. డోస్ పెంచి అడ్డమైన రాతలతో, అసభ్యకరమైన పదాలతో కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలానే చిక్కుల్లో పడ్డాడు. ట్రాఫిక్ పోలీసులకు చిక్కి అడ్డంగా బుక్కయ్యాడు.
హిమాయత్ నగర్‌లోని లిబర్టీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు బైక్ మీద వేగంగా వచ్చాడు. వెంటనే పోలీసులు ఆ బండిని ఆపారు. అది కొత్త బైక్. ఇంకా రిజిస్ట్రేషన్ నంబర్ రాలేదు. నంబర్ ప్లేట్‌పై మాత్రం ‘ఆగు బే’ అని ఇంగ్లీష్‌లో అభ్యంతరకర రీతిలో రాసి ఉంది. అది చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఇలా ఎందుకు రాశావని యువకుడిని పోలీసులు ప్రశ్నించగా.. ఫ్యాషన్‌గా ఉంటుందని తలతిక్క సమాధానం చెప్పాడు. దీంతో పోలీసులకు మండింది. అసలే నెంబర్ లేదు, పైగా వల్గర్ రాతలు.. దీంతో అతడిపై కేసు బుక్ చేశారు. నంబర్ ప్లేట్, లైసెన్స్ లేకపోవడంతో కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకున్నారు.
సాధారణంగా మామ్స్ గిఫ్ట్, డ్యాడ్స్ గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్ అని వాహనాల వెనుక నెంబర్ ప్లేట్లపై రాసుకోవడం కామన్. కొందరు స్లోగన్స్ రాసుకుంటే మరికొందరు మంచి మంచి మేసేజ్‌లు రాసుకుంటారు. ఇందులో తప్పు లేదు. కానీ ఈమధ్య కొందరు ఆకతాయిలు మరీ టూమచ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఫ్యాషన్ పేరుతో పైత్యం ప్రదర్శిస్తున్నారు. వాహనాల నంబర్ ప్లేట్లపై ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తున్నారు. అదేమంటే ఫ్యాషన్ అని బిల్డప్ ఇస్తున్నారు. వెనుకనుంచి పెద్దలు, ప్రముఖులు వస్తున్నారనే కనీస ఇంగితం కూడా లేకుండా పోయింది. చివరకు ఇదిగో ఇలా అనుభవిస్తున్నారు. నలుగురిలో డిఫరెంట్‌గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు.. కానీ ఇలాంటి లిమిట్స్ క్రాస్ చేయడం కరెక్ట్ కాదు.