వైసీపీ నేత, నిర్మాతకు బెదిరింపుల కేసు : పరారీలో బండ్ల గణేష్

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు

  • Published By: veegamteam ,Published On : October 5, 2019 / 04:02 AM IST
వైసీపీ నేత, నిర్మాతకు బెదిరింపుల కేసు : పరారీలో బండ్ల గణేష్

Updated On : October 5, 2019 / 4:02 AM IST

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం(అక్టోబర్ 4,2019) రాత్రి బండ్ల గణేష్‌ తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని పీవీపీ ఫిర్యాదు చేశారు. దౌర్జన్యం చేశాడని తెలిపారు. తనకు ఇవ్వాల్సిన డబ్బు అడిగినందుకు బండ్ల గణేష్ ఈ విధంగా చేశాడని పీవీపీ పోలీసులతో చెప్పారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’ సినిమాకి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. టెంపర్ సినిమాకి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్‌ చేశారు. కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి తన ఇంటికి వచ్చిన బండ్ల గణేష్‌.. బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డాడని పీవీపీ తెలిపారు. దీనిపై జూబ్లిహిల్స్ పోలీసులకు పీవీపీ ఫిర్యాదు చేశారు. పీవీపీ ఫిర్యాదుతో 448, 506, రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ పరారీలో ఉన్నాడు. బండ్ల గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోనూ బండ్ల గణేష్‌ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి.