ప్లీజ్ : SI రాత పరీక్షలు వాయిదా వేయండి

SI (సివిల్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే తుది రాత పరీక్షలని వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఏకంగా నెల రోజుల పాటు పోస్ట్ పోన్ వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు

  • Published By: veegamteam ,Published On : March 28, 2019 / 02:23 AM IST
ప్లీజ్ : SI రాత పరీక్షలు వాయిదా వేయండి

Updated On : March 28, 2019 / 2:23 AM IST

SI (సివిల్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే తుది రాత పరీక్షలని వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఏకంగా నెల రోజుల పాటు పోస్ట్ పోన్ వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు

SI (సివిల్) పోస్టుల భర్తీ కోసం నిర్వహించే తుది రాత పరీక్షలని వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఏకంగా నెల రోజుల పాటు పోస్ట్ పోన్ వేయాలని కోరుతున్నారు. ఈ మేరకు పోలీసు నియామక బోర్డు  చైర్మన్ వీవీ శ్రీనివాస్ కు.. పోలీసుల అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి కారణం సార్వత్రిక ఎన్నికలే. చాలామంది కానిస్టేబుళ్లు SI పరీక్షల్లో అర్హత సాధించారని ఆయన తెలిపారు. కీలకమైన తుది రాత పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలు రావడంతో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు ఎన్నికల బందోబస్తులో ఉన్నారు.

దీంతో వారికి చదువుకునే అవకాశం లేకుండా పోయిందని గోపిరెడ్డి వాపోయారు. ఈ కారణంగా ఏప్రిల్ 20, 21 జరిగే SI (సివిల్) రాత పరీక్షలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్  20, 21 తేదీల్లో SI (సివిల్) రాత పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఏప్రిల్ 28న కానిస్టేబుల్ (సివిల్) రాత పరీక్ష ఉంటుంది.