రవిప్రకాశ్ పోలీసు కస్టడీ పిటిషన్ వాయిదా
చీటింగ్ కేసులో అరెస్టయిన టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్‌ను కస్టడీకి అప్పగించాలని బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను గురువారం(అక్టోబర్ 10,2019)

చీటింగ్ కేసులో అరెస్టయిన టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్‌ను కస్టడీకి అప్పగించాలని బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను గురువారం(అక్టోబర్ 10,2019)
చీటింగ్ కేసులో అరెస్టయిన టీవీ9 బహిష్కృత సీఈవో రవిప్రకాశ్‌ను కస్టడీకి అప్పగించాలని బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను గురువారం(అక్టోబర్ 10,2019) వాయిదా వేసింది కోర్టు. టీవీ9 డబ్బుల దారి మళ్లింపులు రవిప్రకాశ్‌పై చీటింగ్ కేసు నమోదవడంతో.. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు రాబట్టాల్సి ఉన్నందున రవిప్రకాశ్ ను కస్టడీకి కోరారు పోలీసులు.
టీవీ9 నిధుల కుంభకోణంలో రవిప్రకాశ్ అరెస్ట్ అయ్యారు. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. టీవీ యాజమాన్యమైన అలందా మీడియా హౌజ్‌కు చెందిన రూ.18 కోట్ల మొత్తాన్ని బోనస్ పేరుతో పక్కదారి పట్టించారని రవిప్రకాశ్ పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన రవిప్రకాశ్.. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.
రవిప్రకాశ్.. మరో మాజీ డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారని ప్రస్తుత టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో… బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 18వ తేదీ వరకూ రిమాండ్ విధించిన విషయం విదితమే.
రవిప్రకాశ్, మూర్తి ఇద్దరూ చెక్‌పవర్‌ను దుర్వినియోగం చేసినట్లుగా విచారణలో తేలింది. బోనస్, ఎక్స్‌గ్రేషియాల పేరిట నిధులు డ్రా చేసినట్లుగా కొత్త యాజమాన్యం గుర్తించింది. రికార్డుల తనిఖీల సమయంలో.. రవిప్రకాశ్ దోపిడీ బయటపడింది.