రికార్డు సృష్టించిన “రాదు” వీడియో
మిలియన్ వ్యూస్ సాధించిన రాదు వీడియో
మిలియన్ వ్యూస్ సాధించిన రాదు వీడియో
హైదరాబాద్: మందుకొట్టి బండి నడిపి పోలీసులుకు చిక్కిన కుర్రోడు మద్యం మత్తులో పోలీసులతో వాగ్వివాదానికి దిగినప్పుడు వాడిన “రాదు” అనే పదం వైరల్ అయ్యి ఇప్పుడు సంచలనం అయ్యింది. “రాదు” పేరుతో రిలీజ్ చేసిన వీడియో వారం రోజుల్లో మిలియన్ వ్యూస్ సాధించింది.
వివరాల్లోకి వెళితే 2018 అక్టోబర్ 28న డ్రంక్ అండ్ డ్రయివ్ లో పోలీసులకు చిక్కిన మితీష్ @ మిట్టు అనే యువకుడు పోలీసులతో వాగ్వివాదానికి దిగి మీకు కనీసం గవర్నమెంట్, సైకాలజీ అనే పదాల స్పెల్లింగ్ రాదు.. రాదు అని మాట్లాడాడు. అతను మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యంది. ఆతర్వాత మితీష్ ఉపయోగించిన “రాదు” అనే పదంతో డబ్ స్మాష్ లు టిక్ టాక్లో వీడియోలు, ఫేస్ బుక్ లో రావటంతో రేడియో మిర్చి వారు మితేష్ తో కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీసులతో చేసిన వాగ్వివాదానికి పశ్చాత్తాప పడిన మితేష్ రేడియో మిర్చిలో పాల్గోని శ్రోతలతో సంభాషించాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “రాదు” వీడియోలు చూసిన బిగ్బాస్ ఫేం రోల్ రైడా మితీష్కు ఫోన్ చేసి రాదు అనే పదం బాగా వైరల్ అయింది. మనం సోషల్ మెసేజ్‌తో ఎంటర్‌టైన్ గా ఓ వీడియో సాంగ్ చేద్దాం అని ఫోన్ చేసి చెప్పటంతో ఇద్దరూ కలిసి “డ్రంక్ అండ్ డ్రయివ్” మీదే వీడియో సాంగ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. డిసెంబర్ 31న అందరూ మద్యం సేవించి వాహనాలుడుపుతారు కనుక ఆరోజు రిలీజయ్యేలా సాంగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. వీరిద్దరూ కలిసి కమ్రాన్ మ్యూజిక్ తో కలిసి వీడియో రాప్ సాంగ్ ను తీసి డిసెంబర్ 30న రిలీజ్ చేశారు. ఈ వారం రోజుల్లో వీడియో మిలియన్ వ్యూస్ దాటి రికార్డు సృష్టించింది.