టీ.కాంగ్రెస్‌కు షాక్ : టీఆర్ఎస్‌లోకి రేగా కాంతారావు, ఆత్రం సక్కు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ : శాసన మండలి ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే శాసన సభ సభ్వత్వానికి కూడా రాజీనామా చేస్తామని వారు వెల్లడించారు. మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో సీఎం కేసీఆర్ తో భేటీ అవుతామని తెలిపారు. టీఆర్ ఎస్ లో చేరే అంశంపై విధివిధానాలను రూపొందించుకుంటామని చెప్పారు. టీసర్కార్ హయాంలో ఇటీవల జరుగుతున్న అభివృద్ధి పనులు తమను ఆకర్షించాయని తెలిపారు.
మార్చి 12న తెలంగాణ శాసన మండలి ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు కాంగ్రెస్ ను వీడనున్నారని జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశమైంది. మరోవైపు మార్చి 2 శనివారం సీఎం కేసీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలిశారు.