గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
సకల జనభేరి సభలో పాల్గొన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. కరీంనగర్-2 డిపోకు చెందిన డ్రైవర్ బాబు.. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సభకు

సకల జనభేరి సభలో పాల్గొన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. కరీంనగర్-2 డిపోకు చెందిన డ్రైవర్ బాబు.. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సభకు
సకల జనభేరి సభలో పాల్గొన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయాడు. కరీంనగర్-2 డిపోకు చెందిన డ్రైవర్ బాబు.. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సభకు హాజరయ్యాడు. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు ప్రసంగాలు చేస్తుండగా..బాబుకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. తోటి కార్మికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. సమ్మె పట్ల కలత చెందడం వల్లే గుండెపోటుతో బాబు చనిపోయాడని తోటి కార్మికులు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతికి పలు పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు.
ఆర్టీసీ సమ్మెతో తీవ్ర కలత చెందిన బాబు గుండె పోటుకు గురై చనిపోయాడని తోటి కార్మికులు అన్నారు. డ్రైవర్ బాబు మృతికి సంతాపంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 27వ రోజుకు చేరింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్మికులు రోజురోజుకు తమ సమ్మెను ఉధృతం చేస్తున్నారు. వివిధ రాజకీయ పక్షాలు కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతున్నాయి. ప్రజాసంఘాలు వారికి బాసటగా నిలుస్తున్నాయి. దీంతో కార్మికులు రోజుకో విధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నారు. ఇవాళ(అక్టోబర్ 31,2019) ఒక్క రోజు దీక్షలకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 24 గంటలపాటు ఈ సామూహిక దీక్షలు కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ కార్మికులు దీక్షలకు రెడీ అయ్యారు.