నా కూతురుని సూర్యనే చంపాడు : సీరియల్ నటి ఝాన్సీ తల్లి

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 05:54 AM IST
నా కూతురుని సూర్యనే చంపాడు : సీరియల్ నటి ఝాన్సీ తల్లి

Updated On : February 6, 2019 / 5:54 AM IST

హైదరాబాద్: ప్రేమ విఫలం.. ఒంటరి జీవితంలో ఒత్తిడితో సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందా.. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి, జీవించిన నటి.. నిజ జీవితంలో ఓడిపోయిందా.. పరిస్థితులు అలాగే అనిపిస్తున్నాయి. స్టార్ మా లో పవిత్రబంధం అనే సీరియల్ ద్వారా ఇంటింటికీ పరిచయం అయ్యింది నటి ఝాన్సీ. కొన్నేళ్లుగా బుల్లితెరపై నటిస్తూ తన కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుకుంది. జీవితంలో ఎంతో ఎదగాల్సిన ఈ సమయంలో.. అర్థాంతరంగా జీవితాన్ని బలి తీసుకోవటం టీవీ రంగాన్ని షాక్‌కు గురి చేసింది. రెండేళ్ల క్రితం నటుడు ప్రదీప్, ఇటీవల తమిళనాడులో ప్రియాంక అనే నటితోపాటు.. తెలుగులో న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసే రాధిక ఆత్మహత్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య అయినా.. వీరిలో కామన్‌గా కనిపించింది మాత్రం ఒత్తిడి. జీవితంలో బాధలను ఎదిరించటంలో వారు ఫెయిల్ అయ్యారని మానసిక వైద్యులు అంటున్నారు.

 

పవిత్రబంధం సీరియల్ నటి ఝూన్సీ ఆత్మహత్యలోనూ ప్రేమ విఫలమే కారణం అంటున్నారు పోలీసులు. విజయవాడకు చెందిన సూర్య అనే యువకుడితో ఝాన్సీకి పరిచయం ఏర్పడింది.  సీరియల్స్ లో పని చేసే మరో అమ్మాయి ద్వారా ఝాన్సీకి సూర్య పరిచయం అయ్యాడు. ఇద్దరి కులాలు వేరు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు  సమాచారం. ఆరు నెలలుగా సూర్యతోనే ఝాన్సీ కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోవాలని భావించిన ఝూన్సీ.. కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. సహజంగానే ఇంట్లో వారికి  ఉండే ఆందోళనే.. వారు వ్యక్తం చేశారు. కులాలు వేరు కావడంతో ఝాన్సీ పేరెంట్స్ ఆలోచనలో పడ్డారు. అబ్బాయి తన తల్లిదండ్రులను ఒప్పిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఝాన్సీ  తల్లిదండ్రులు చెప్పారు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రియుడు సూర్యతో ఝాన్సీకి విబేధాలు వచ్చాయని ఆమె తల్లి చెప్పింది. చిన్నగా మొదలైన మాటలు.. పట్టింపుల వరకు  వెళ్లాయంది. ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు చెప్పింది. ప్రేమలో గొడవల కారణంగా కొన్ని నెలలుగా ఝాన్సీ నటనకు కూడా దూరంగా ఉంటోందని ఝాన్సీ తల్లి చెప్పింది. ఆరు నెలలగా ప్రేమ  వ్యవహారం నడుస్తున్నా.. రెండు నెలల క్రితమే తనకు విషయం తెలిసిందని ఝాన్సీ తల్లి చెప్పింది.

 

పవిత్రబంధం సీరియల్ నటి ఝూన్సీ ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది అనేది ఆసక్తిగా మారింది. ప్రాథమిక వివరాల ప్రకారం 2019, ఫిబ్రవరి 5వ తేదీ అర్థరాత్రి వరకు ఝూన్సీ తన లవర్  సూర్యతో మాట్లాడిందంట. ఆ తర్వాత కొద్దిసేపు చాటింగ్ చేసింది. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఇంట్లోనే తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది.  ఝూన్సీ ఆత్మహత్యతో ఆమె తల్లిదండ్రులు బంధువులు షాక్ తిన్నారు. అప్పటివరకు తనతో బాగా మాట్లాడిందని ఆమె గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరైంది. సూర్యే తన కూతురి మరణానికి  కారణం అని ఆమె ఆరోపించింది. సీరియల్స్ నటించకుండా చేశాడని, మానసికంగా వేధించాడని ఝాన్సీ తల్లి కంటతడి పెట్టింది. అసలు సూర్య ఎవరో కూడా తమకు తెలియదని చెప్పింది. రెండు  నెలల క్రితమే కూతురి ప్రేమ వ్యవహారం తెలిసిందని చెప్పింది.

 

ఝాన్సీది కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వాడాలి గ్రామం. నటనపై ఇంట్రస్ట్‌తో మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కి వచ్చింది. ఝాన్సీ ఇంటర్ చదివింది. పవిత్ర బంధం సీరియల్‌లో నటించింది. 6  నెలలుగా విజయవాడకు చెందిన సూర్య(25) అలియాస్ నానితో ఝాన్సీ ప్రేమలో పడింది. 2 నెలల క్రితం తన ఇంట్లో ప్రేమ వ్యవహారం చెప్పింది. పెళ్లి విషయమై కొంతకాలంగా సూర్య, ఝాన్సీ  మధ్య గొడవ జరుగుతున్నట్లు ఝాన్సీ తల్లి అన్నపూర్ణ తెలిపింది.

 

ప్రేమించిన సూర్య కోరిక మేరకు సీరియల్స్‌లో నటించడం కూడా ఝాన్సీ మానేసిందని అన్నపూర్తి చెప్పింది. ఇంతలో ఘోరం  జరిగిపోయిందని ఆమె కంటతడి పెట్టింది. తన కూతురు మృతికి సూర్య కారణం అని ఆమె ఆరోపించింది. ఈ మేరకు సూర్యపై ఝాన్సీ తల్లి అన్నపూర్ణ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.