పోలీస్ స్టేషన్‌లో పాము కలకలం
హైదరాబాద్ ట్రాఫిక్ మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పాము కలకలం రేపింది.

హైదరాబాద్ ట్రాఫిక్ మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పాము కలకలం రేపింది.
హైదరాబాద్ ట్రాఫిక్ మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పాము కలకలం రేపింది. ఇటీవలే వర్షాలు కురవడంతో పక్కనే ఉన్న చెట్ల పొదల్లోంచి పాము బయటకు వచ్చింది. గోడ సందులో నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
సడెన్‌గా పాము కనిపించడంతో పోలీసులు భయాందోళనకు గురయ్యారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ పామును చాకచక్యంగా పట్టుకుని క్యాన్‌లో బంధించాడు. ఆ తర్వాత స్నేక్ సొసైటీ సభ్యులకు అప్పగించారు.