తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సురేష్ భార్య
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత సంచలన విషయాలు వెల్లడించింది.

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత సంచలన విషయాలు వెల్లడించింది.
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత సంచలన విషయాలు వెల్లడించింది. ఆస్పత్రిలో చనిపోయే ముందు సురేష్… భార్య లతతో మాట్లాడారు. తహశీల్దార్ పై దాడి చేయాలని వెళ్లలేదని తనతో చెప్పాడని తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసి తహశీల్దార్ ను భయపెట్టాలనుకున్నాడని చెప్పారు. అయినా వినకపోవడంతో ఆమెను చంపాలనుకున్నానని తనతో చెప్పాడని తెలిపారు. తన భర్త లాంటి చావు మరే రైతుకు రావొద్దన్నారు. ఇప్పటికే రూ.లక్షలు అప్పు చేశాడని తెలిపారు. భూముల వ్యవహారంలోనే ఎవరికి డబ్బులు ఇచ్చాడో తెలియదన్నారు. తహశీల్దార్ కు లంచం ఇచ్చానని భర్త తనతో చెప్పాడని తెలిపారు.
తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ చనిపోయాడు. ఎమ్మార్వో విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన రైతు సురేష్, ఈ క్రమంలోనే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. విజయా రెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోగా.. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్న సురేష్ గురువారం (నవంబర్7, 2019) ఉదయం చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.
చనిపోక ముందు నిందితుడు సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూపట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని, అయితే ఆమె సహకరించకపోవడంతో ఈ పని చేసినట్లు చెప్పాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే ఆమెపై కక్ష పెంచుకుని సజీవదహనం చేసినట్లు వాంగ్మూలంలో తెలిపాడు.