తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సౌందర్య రాజన్

తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా సౌందర్య రాజన్ నియమితులు అయ్యారు. మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణ గవర్నర్ గా మారగా.. ఆయనను తొలగించి సౌందర్యరాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించింది కేంద్రం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్‌గా.. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశారు. రెండు రాష్ట్రాల తొలి ప్రభుత్వాలకు పూర్తి కాలం గవర్నర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకంగా ఆరుగురితో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన నరసింహన్ 2010 నుంచి 2019 వరకు గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ కేంద్రం లేటెస్ట్ గా ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమెకు కేంద్రం గవర్నర్ గా అవకాశం కల్పించింది. తమిళ సాయి సౌందర్య రాజన్ వృత్తిరిత్యా డాక్టర్. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో పుట్టారు.
బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో సౌందర్ రాజన్ ఎంబీబీఎస్ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లుగా ఎంపీగా పోటీ చేసిన ఆమె ఒక్కసారి కూడా గెలవలేదు.
ఇక మాజీ కేంద్రమంత్రి , తెలంగాణ బీజేపీ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించారు. కేరళ గవర్నర్ గా ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్ ను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోశ్యారి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్‌కు బదిలీ చేశారు.