ముహూర్తం ఖరారు : 18న మంత్రివర్గ విస్తరణ!

  • Published By: madhu ,Published On : January 6, 2019 / 02:00 AM IST
ముహూర్తం ఖరారు : 18న మంత్రివర్గ విస్తరణ!

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి తర్వాతే సమావేశాలు నిర్వహించనున్నారు. 2019, జనవరి 17 నుంచి 4 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుండగా… అదే రోజు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడ్డాయి. 18వ తేదీనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. తొలి విడ‌త‌లో క‌నీసం 10 మందికి కేబినెట్‌లో చోటు ద‌క్కే అవకాశముంది. గ‌త ప్రభుత్వంలో 
ఉన్నవారితో పాటు… కొందరు కొత్త వారికి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. గతంలో మహిళా మంత్రి లేరు కాబట్టి… ఈసారి ఒక్కరికైనా అవకాశం ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. 
> ఈనెల 17 నుంచి 20వ తేదీ శాసనసభ సమావేశాలు 
ఈనెల 16న ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం 
ప్రొటెం స్పీక‌ర్‌గా వ్యవ‌హ‌రించ‌నున్న ముంతాజ్ ఖాన్ 
18న స్పీక‌ర్, డిప్యూటీ స్పీక‌ర్ ఎన్నిక‌
18వ తేదీనే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌..?
19వ తేదీన గవర్నర్ ప్రసంగం  
20వ తేదీన గవర్నర్  ప్రసంగంపై ధన్యవాద తీర్మానం 
స్పీకర్ రేసులో పోచారం, ఈటల, రెడ్యానాయక్
10 మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం

ఇక ఈసారి కేబినెట్‌లో కీలక నేతలకు కీలక శాఖలు దక్కే ఛాన్స్ ఉంది. అయితే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌కు కేబినెట్‌లో చోటు ద‌క్కుతుందా లేదా అన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది.