మండుతున్న ఎండలు : హైదరాబాద్ లో 41 డిగ్రీలు

మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 1)41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కూల్ డ్రింక్స్..కొబ్బరి బోండాలు..ఫ్రూట్ జ్యూస్ లను తాగుతు తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు.
కాగా ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారంనుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని..ఈ ప్రభావంతో వేడి మరింతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఆదివారం ఉష్ణోగ్రతలను చూస్తే అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకమండలం ఏడూళ్ళబయ్యారం, నిర్మల్ జిల్లాపెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నిర్మల్ జిల్లా భైంసా, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.