వేటు పడింది : ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
పార్టీ మారిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతుండడంతో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు

పార్టీ మారిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతుండడంతో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు
హైదరాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 17వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతుండడంతో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు మండలి ఛైర్మన్. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాములు నాయక్, యాదవరెడ్డిలపై అనర్హత వేటు వేస్తూ జనవరి 16వ తేదీన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై వేటు పడకుండా సీఎల్పీని..టీఆర్ఎస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.
నెల రోజుల క్రితం ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు. ఇక మిగిలిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వేటు వేయాలని చెప్పిన గులాబీ నేతలు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. పార్టీ మార్పుపై వివరణ ఇవ్వాలంటూ సభ్యులకు మండలి ఛైర్మన్ నోటీసులు పంపించారు. అనంతరం మండలి ఛైర్మన్ ఇరువైపులా వాదనలు విన్నారు. చట్ట విరుద్ధంగా పార్టీ మారారని టీఆర్ఎస్ గట్టిగా వాదించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆధారాలను పక్కాగా సమర్పించడంతో చివరకు మండలి ఛైర్మన్ వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.