సేవ్ నల్లమలకు టాలీవుడ్ మద్దతు 

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 04:34 AM IST
సేవ్ నల్లమలకు టాలీవుడ్ మద్దతు 

Updated On : September 13, 2019 / 4:34 AM IST

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై పలు రాజకీయ పార్టీలతో పాటు సెలబ్రిటీలు కూడా వ్యతిరేకిస్తున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై తీవ్ర వ్యతరేకత వస్తున్న క్రమంలో సెలబ్రిటీలు కూడా దీనికి మద్దతుగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఉద్యమిస్తున్నారు. తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. నల్లమలను కాపాడుకుందాం అంటూ నినదిస్తున్నారు. 

ఈ అంశంపై టాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందిస్తూ నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే పర్యావరణానికి తీవ్రముప్పు ఏర్పడుతుందని గిరిజనులు, ఆదివాసీలు, చెంచులు వంటి పలు అటవీ జాతులకు సంబంధించిన వారు అటవులనే నమ్ముకుని జీవిస్తుంటారనీ..ఇప్పటికే అంతరించిపోతున్నాయనీ వాపోతున్న పెద్ద పులల ఆవాసాలైన నల్లమలో తవ్వకాలో మరింత ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.  

ఇప్పటికే నీటి వనరులు విధ్వంసం అవుతున్నాయనీ…కరువుతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో వరదలు ముంచివేస్తున్నాయనీ..ఈ క్రమంలో మరింతగా పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతుందని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిగితే ఈ ప్రమాదం మరింతగా ఉంటుందంటున్నారు.  

దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమానికి పలువురు సెలబ్రిటీలు మద్దతు పలుకుతున్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హీరో విజయ్ దేవర కొండ, గోరేటి వెంకన్న, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, చంద్ర సిద్ధార్థ, ఆర్పీ పట్నాయక్, గాయత్రీ గుప్తా, ప్రముఖ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వంటి పలువురు సెలబ్రిటీలు నల్లమల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే ఊరుకునేది లేదనీ ఉద్యమం చేపడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. భావి తరాలకు బంగారు తెలంగాణను ఇస్తామా? యురేనియం కాలుష్యం ఇస్తామా? అన్నది అన్ని ప్రజాసంఘాలు, రాజాకీయ పక్షాలు ఆలోచించాలని పవన్ ప్రశ్నించారు. నల్లమల ఆమ్రాబాద్ అడవుల్లో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందనీ.. పవన్ ఆవేదన వ్యక్తంచేశారు.  నల్లమలలో పర్యావరణ పరిరక్షణ కోసం జనసేన మద్దతు కొనసాగుతుందని పవన్ తెలిపారు. ఇది కేవలం తెలంగాణకే కాదు తెలుగు రాష్ట్రాలకు నష్టమని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశంపై త్వరంలో పర్యావరణ పరిరక్షకులతో పాటు స్వచ్ఛంధ సంస్థలు, మేధావులు, నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తామని పవన్ తెలిపారు.  

సేవల్ నల్లమల ఉద్యమానికి పలు స్వచ్ఛంధ సంస్థలు కూడా వ్యతిరేకిస్తు..ఉద్యమానికి మద్దతునిస్తున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ దేవర కొండ కూడా స్పందిస్తు ఈ ఉద్యమానికి తాను పూర్తి మద్దతునిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఇప్పటికే 20వేల హెక్టార్లలో ఎకారాల్లో నల్లమల అడవులు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు.  ఇప్పటికే నదులు, చెరువులు, కాలువలు,చెరువులు వంటి నీటి వనరులు కాలుష్యంగా మారిపోయాయని నీటి సమస్యలను ఎదుర్కొంటున్నామనీ..గాలితో పాటు నీటి వనరులన్నీ కలుషితమవుతున్నాయనీ ఆవేదన వ్యక్తంచేశారు. యురేనియాన్ని కొనుక్కోవచ్చు గానీ అడవులను కొనుక్కోగలమా? అంటూ విజయ్ దేవరకొండ ప్రశ్నించారు.