హైదరాబాద్ డీమార్ట్‌లో తీవ్రవాది వీడియో : అసలు నిజం ఇదే

హైదరాబాద్‌ అత్తాపూర్ డీమార్ట్‌లోకి ఓ ఉగ్రవాది చొరబడ్డాడని, బాంబు పెట్టాడని, అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 01:30 PM IST
హైదరాబాద్ డీమార్ట్‌లో తీవ్రవాది వీడియో : అసలు నిజం ఇదే

Updated On : February 17, 2019 / 1:30 PM IST

హైదరాబాద్‌ అత్తాపూర్ డీమార్ట్‌లోకి ఓ ఉగ్రవాది చొరబడ్డాడని, బాంబు పెట్టాడని, అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

హైదరాబాద్‌ అత్తాపూర్ డీమార్ట్‌లోకి ఓ ఉగ్రవాది చొరబడ్డాడని, బాంబు పెట్టాడని, అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. కశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. డీమార్ట్‌లో ఉగ్రవాది చొరబడ్డాడు అనే వార్త నగరవాసుల్లో ఆందోళన నింపింది. అయితే ఆ తర్వాత ఆ వీడియో ఫేక్ అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ వీడియో నిజమైనదే అని తేలింది. అయితే ఈ సంఘటన జరిగింది హైదరాబాద్‌లో కాదు. ముంబైలోని విరార్ ప్రాంతంలో ఉన్న డీమార్ట్‌లో ఫిబ్రవరి 15వ తేదీన జరిగింది.

 

అది కూడా నిజమైన తీవ్రవాది కాదు. ఇదంతా మాక్ డ్రిల్‌లో భాగంగా జరిగింది. ముంబై పోలీసులు, క్విక్ రిస్పాన్స్ టీమ్స్ కౌంటర్ టెర్రర్ మాక్ డ్రిల్ నిర్వహించాయి. టెర్రరిస్టులు చొరబడినప్పుడు పోలీసులు ఎలా స్పందించాలి.. ప్రజలు ఎలా తప్పించుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు. ఓ డమ్మీ టెర్రరిస్ట్‌ను లోపలికి పంపించి అతడిని చాకచక్యంగా ఎలా పట్టుకోవాలో లైవ్‌లో చేసి చూపించారు. ఈ విషయం తెలియక మాల్‌కు వచ్చిన కస్టమర్లు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మ్యాటర్ తెలిశాక కూల్ అయ్యారు. ఇక ముంబై డీమార్ట్‌లో జరిగిన మాక్ డ్రిల్ అనే నిజం తెలిశాక హైదరాబాద్ వాసులు కూడా రిలాక్స్ అయ్యారు.

 

కశ్మీర్‌లో ఉగ్రదాడితో అన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలు అలర్ట్ అయ్యాయి. బస్టాండ్‌, రైల్వే స్టేషన్, సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించినట్టు సమాచారం.