తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు: ట్రైన్ టైమింగ్స్ ఇవే

దసరా సెలవులు పూర్తవడం.. పండుగకు ఊళ్లకు వెళ్లిన వారు తిరిగి పనిచేసే చోటుకు చేరుకోవడం.. పెళ్లిళ్లు ఇలా అనేక కారణాలతో ఆర్టీసి బస్సులు.. రైళ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి.
ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాకినాడ-సికింద్రాబాద్-కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైలు సర్వీసులను నడపేందుకు నిర్ణయించుకుంది.
సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు నడపేందుకు నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ. ప్రత్యేక రైలు రేపు(12 అక్టోబర్ 2019) రాత్రి 8.45 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరనుంది.
అదేవిధంగా అక్టోబర్ 12వ తేదీన సికింద్రాబాద్ నుంచి రాత్రి 8.45 గంటలకు కాకినాడకు ప్రత్యేక రైలు బయలుదేరనుంది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.