చిరు వ్యాపారికి మట్టి కుండలు పంపిన ఉపాసన

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 09:54 AM IST
చిరు వ్యాపారికి మట్టి కుండలు పంపిన ఉపాసన

Updated On : April 15, 2019 / 9:54 AM IST

హైదరాబాద్ : ఉపాసన పరిచయం అక్కరలేని పేరు. మెగా ఫ్యామిలి కోడలిగా..కామినేని ఆడబిడ్డగానే కాక స్వంత్రభావాల వ్యక్తిగా మహిళా పారిశ్రామిక వేత్తగా ఇలా ఉపాసన తనకంటు ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. సామాజిక సేవలో కూడా యాక్టివ్ గా ఉండే ఉపాసన తన భావాలను సోషల్ మీడియా లో అన్నీ షేర్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో ఉపాసన ట్విటర్‌లో పంచుకున్న ఓ ఫొటో.. ప్లాస్టిక్‌ వాడొద్దనే మెసేజ్ ను ఓ చిరు వ్యాపారికి ఎనలేని సంతోషాన్నిచ్చింది. 
Read Also : దేశంతోపాటే ప్రయాణం : సల్మాన్ ఖాన్ ‘భారత్’ ఫస్ట్ లుక్

ఉపాసన కేబీఆర్‌ పార్క్ కు వాకింగ్ కు వెళుతుంటారు. ఆ క్రమంలో ఆమెకు అక్కడ తోపుడు బండిపై తులసి, పుదీన వంటి ఆకుల రసాలు అమ్మే వ్యక్తి వద్ద పుదీనా వాటర్ తాగారు. తరువాత ఆ పుదీనా వాటర్ అమ్మే వ్యక్తిని..ఆ తోపుడు బండి, అందులో ఉన్న ప్లాస్టిక్‌ కుండల ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పెట్టారు. ఉపాసనను ట్విటర్‌లో ఫాలోవర్స్ ఆ చిరువ్యాపారి అంతా ప్లాస్టిక్‌ సామగ్రే వాడుతున్నాడని గమనించారు. ప్లాస్టిక్‌ వాడకం వద్దంటూ ఆమెకు రీట్వీట్‌ చేశారు. దీనికి ఉపాసన వెంటనే స్పందించారు.

 ఆ విషయాన్ని గమనించలేదన్నారు.తను నడిపే ‘మిస్టర్‌ సి-ఫర్‌ ఛేంజ్‌’ అనే సంస్థకు చెందిన సిబ్బందితో మట్టి కుండలు కొనుగోలు చేయించి ఆ చిరు వ్యాపారికి బహుమతిగా పంపారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటూ ఆ చిరువ్యాపారికి సందేశం పంపారు. కుండలు పంపింది..రామ్‌చరణ్‌ భార్య అని తెలుసుకుని తెగ ఆనందపడిపోయాడు..