ZOMATOకు ఆ రెస్టారెంటే ఎందుకు ప్రత్యేకం

ZOMATOకు ఆ రెస్టారెంటే ఎందుకు ప్రత్యేకం

Updated On : April 11, 2019 / 4:08 PM IST

కొన్ని నెలల క్రితం రెస్టారెంట్ కు వెళ్తే సీట్ కోసం లైన్‌లో ఉండాల్సి వచ్చేంది. మన వంతు వచ్చేంతవరకూ ఆకలిని అలా ఆపుకుని ఉండాల్సిందే. కానీ, ఇప్పుడు పరిస్థితుల్లో ఏ రెస్టారెంట్ కు వెళ్లినా ముందుగా కనిపించేది జొమాటో డెలీవరీ బాయ్సే. ఇంటి దగ్గరి నుంచి ఆర్డర్ చేసే వాళ్లు ఎక్కువవడంతో రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. 

అలా అని హైదరాబాద్‍‌లో ఉన్న రెస్టారెంట్‌లు అన్నింటికీ అంతక్రేజ్ లేదు. కేవలం కొన్ని మాత్రమే. వాటిలో హైదరాబాద్ బావర్జీకు మాత్రం పీక్స్‌లో క్రేజ్ ఉంది. రోజుకు 2వేల బిర్యానీ ఆర్డర్లు ఆ రెస్టారెంట్ నుంచి వెళ్తున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే కదా. 

ఈ విషయాన్ని జొమాటోనే షేర్ చేసింది. వరుసగా ఓ 50మంది ఉన్న జొమాటో ఏజెంట్ల ఫొటోను పోస్టు చేస్తూ.. ఇలా బారులు తీరి ఉన్న రెస్టారెంట్ మీ సిటీలో ఉందా అని ప్రశ్నించింది. దానికిందే హైదరాబాద్ లో ఉన్న బావర్చి టేస్ట్ అలాంటిది. రోజు మొత్తంలో ఆ రెస్టారెంట్ కు వచ్చే ఆర్డర్ల గురించి ఉంటే మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారంటూ కామెంట్ కూడా చేసింది. 

ఆహారప్రియులకు జొమాటో ఎంతగా నాటుకుపోయిందంటే.. ఫుడ్ కోసం 2గంటల సమయమైనా ఎదురుచూసేంత ప్రభావితమైపోయింది. బ్రహ్మపుత్ర నదిపై ప్రయాణించి గువాహటిలోని చికెన్ హక్కా నూడిల్స్ ను డెలీవరి చేయడానికి అంతే క్రేజ్ దక్కించుకుంది.