Bottle hurled at kejriwal: సీఎం కేజ్రీవాల్ వైపుగా వాటర్ బాటిల్ విసిరేసిన వ్యక్తి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైపుగా ఒకరు వాటర్ బాటిల్ విసిరారు. ఢిల్లీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గుజరాత్ లోనూ తమ పార్టీ జెండా పాతాలని ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా రాజ్ కోట్ లో గార్బా వేడుకలో పాల్గొన్నారు.

Bottle hurled at kejriwal: సీఎం కేజ్రీవాల్ వైపుగా వాటర్ బాటిల్ విసిరేసిన వ్యక్తి

Updated On : October 2, 2022 / 9:56 AM IST

Bottle hurled at kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పైపుగా ఒకరు వాటర్ బాటిల్ విసిరారు. ఢిల్లీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గుజరాత్ లోనూ తమ పార్టీ జెండా పాతాలని ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా రాజ్ కోట్ లో గార్బా వేడుకలో పాల్గొన్నారు.

ఆ సమయంలో కేజ్రీవాల్ దిశగా ఓ వ్యక్తి వాటర్ బాటిల్ విసిరేశాడు. అది కేజ్రీవాల్ కు తగలలేదు. కేజ్రీవాల్ వైపుగా బాటిల్ విసిరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదు. అలాగే, దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. గుజరాత్ లో కేజ్రీవాల్ రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులో జరగాల్సి ఉంది.

ఈ సందర్భంగా ఆప్ ముఖ్యనేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా ఉంటున్నారు. గుజరాత్ లో కేజ్రీవాల్ ప్రకటిస్తున్న ‘ఉచితాలు’ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత’ హామీలు సరికాదంటూ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఉచితాలు వద్దంటూ మోదీ కూడా అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..