Arvind Kejriwal On Bridge Tragedy: అందుకే కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది: కేజ్రీవాల్
అవినీతి కారణంగానే మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన చోటుచేసుకుందని కేజ్రీవాల్ ఆరోపించారు. గడియారాలు తయారు చేసుకునే సంస్థకు బ్రిడ్జి టెండరు ఎలా ఇచ్చారని ఆయన నిలదీశారు. దీన్ని బట్టి ఆ గడియార సంస్థ యజమానికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని స్పష్టమవుతోందని కేజ్రీవాల్ చెప్పారు. బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఆ సంస్థ పేరుగానీ, దాని యజమాని పేరు గానీ లేదని అన్నారు.

aravind kejriwal
Arvind Kejriwal On Bridge Tragedy: గుజరాత్ లో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఆ రాష్ట్రంలోని మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్రిడ్జి కూలిన ఘటనకు బాధ్యతవహిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెంటనే రాజీనామా చేయాలని, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అవినీతి కారణంగానే మోర్బి జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటన చోటుచేసుకుందని కేజ్రీవాల్ ఆరోపించారు.
గడియారాలు తయారు చేసుకునే సంస్థకు బ్రిడ్జి టెండరు ఎలా ఇచ్చారని ఆయన నిలదీశారు. దీన్ని బట్టి ఆ గడియార సంస్థ యజమానికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని స్పష్టమవుతోందని కేజ్రీవాల్ చెప్పారు. బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఆ సంస్థ పేరుగానీ, దాని యజమాని పేరు గానీ లేదని అన్నారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే గుజరాత్ లో ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ భావించినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ఎన్నికలకు మాత్రమే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 12న ఆ రాష్ట్ర ఎన్నికలు జరుగుతాయి.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..