Honey bee ‘boxes’: ఏనుగులను తరిమేయడానికి తేనెటీగల సైన్యం

పంట పొలాలలోకి ఏనుగులు వస్తుండడం, వాటిని తరిమేస్తూ గజరాజులతో స్థానికులు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తుండడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఇటువంటి వాటిని నివారించడానికి మధ్యప్రదేశ్ అధికారులు ఓ వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చారు. గజరాజులను తరిమేసేందుకు తేనెటీగల సైన్యాన్ని దించనున్నారు.

Honey bee ‘boxes’: ఏనుగులను తరిమేయడానికి తేనెటీగల సైన్యం

Honey bee 'boxes'

Updated On : January 22, 2023 / 4:09 PM IST

Honey bee ‘boxes’: పంట పొలాలలోకి ఏనుగులు వస్తుండడం, వాటిని తరిమేస్తూ గజరాజులతో స్థానికులు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తుండడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఇటువంటి వాటిని నివారించడానికి మధ్యప్రదేశ్ అధికారులు ఓ వినూత్న ప్రణాళికతో ముందుకు వచ్చారు. గజరాజులను తరిమేసేందుకు తేనెటీగల సైన్యాన్ని దించనున్నారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు జిల్లాల్లో ఏనుగులు సంచరిస్తూ పదే పదే పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏనుగులను తరిమేసే విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక పద్ధతులపై ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏనుగులను వెళ్లగొట్టే క్రమంలో ఏయే పనులు చేయకూడదు? ఏయే పనులు చేయొచ్చనే అంశాలను వివరించి చెప్పింది.

అందులో ఒక అంశంగా తేనెటీగల గురించి ఉంది. ప్రజలు ఏనుగులను తరిమేసేందుకు వాటి ప్రభావిత ప్రాంతాల్లో తేనెటీగల బ్యాక్సులను ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ఏనుగులకు సాధారణంగా తేనెటీగలంటే భయం ఉంటుందని తెలిపింది. ఏనుగుల తొండాలు, కళ్లపై తేనెటీగలు దాడి చేస్తాయి.

సిధీ, సింగ్రౌలీ, శాహ్దోల్, అనుప్పూర్, ఉమరియా, దిండోరీ, మండ్లా జిల్లాల్లోని గ్రామాల్లో తేనె టీగల పెట్టెలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. దీని వల్ల స్థానికులను ఉపాధి కూడా దొరుకుతుందని చెప్పింది. గత ఏడాది కూడా ‘‘హనీ మిషన్’’ కార్యక్రమం కింద మోరెనా జిల్లాలోని 10 మందికి ప్రభుత్వమే 100 తేనెటీగల పెట్టెలను పంపిణీ చేసింది.

Minister Harish Rao Letter : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీష్ రావు మరోసారి లేఖ