Ex-MP CM Uma Bharti: ఈ రెండింట్లో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వస్తే ప్రజలు చెడునే ఎన్నుకుంటారు: ఉమా భారతి
''ప్రజాస్వామ్యంలో ఒకవేళ చెడు, విపరీతమైన చెడు మధ్య జరిగే పోటీలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వస్తే ప్రజలు చెడునే ఎన్నుకుంటారు. ఆ చెడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల్లో గెలవడం, అధికారంలో ఉండడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, మహిళలను రక్షణ కల్పించడం, చిన్నారులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే ముఖ్యం'' అని ఉమా భారతి చెప్పారు.

I never say that you are Lodhi, you vote for BJP says BJP leader Uma Bharti
Ex-MP CM Uma Bharti: బీజేపీ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు, గోశాలలు, మద్యం దుకాణాల వంటిపై ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు. ”ప్రజాస్వామ్యంలో ఒకవేళ చెడు, విపరీతమైన చెడు మధ్య జరిగే పోటీలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వస్తే ప్రజలు చెడునే ఎన్నుకుంటారు. ఆ చెడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల్లో గెలవడం, అధికారంలో ఉండడం పెద్ద విషయమేమీ కాదు. కానీ, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, మహిళలను రక్షణ కల్పించడం, చిన్నారులకు బంగారు భవిష్యత్తు కల్పించడమే ముఖ్యం” అని ఉమా భారతి చెప్పారు.
మహిళలపై జరుగుతున్న నేరాలకు మద్యపానమే కారణమని ఉమాభారతి చెప్పారు. మద్యం దుకాణాలను గోమాతల శిబిరాలుగా మార్చేయాలని చెప్పారు. మధుశాలలో గోశాల అవసరమని వ్యాఖ్యానించారు. ”కొత్త మద్యం పాలసీని ప్రకటిస్తానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నాతో చెప్పారు.
కొత్త పాలసీ అమలు అవుతుందని నేనేం వేచి చూడబోను. నేను మద్యం దుకాణాల్లో ఆవుల శిబిరాలను ఏర్పాటు చేస్తాను” అని ఉమా భారతి చెప్పారు. కాగా, ఉమా భారతి 2003 డిసెంబరు 8 నుంచి 2004, ఆగస్టు 23 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రిగానూ పని చేశారు.
IT Raids in Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో రెండోరోజు ఐటీ సోదాలు