ఇండియాలో 2021నాటికల్లా సగటు శాలరీ 7శాతం పెరగనుంది!!

ఇండియాలో 2021నాటికల్లా సగటు శాలరీ 7శాతం పెరగనుంది!!

Updated On : February 15, 2021 / 6:50 PM IST

Average Salary in India: ఇండియాలో 2021నాటికి ఉద్యోగుల శాలరీ సగటు 6.4 శాతం వరకూ పెంచనున్నట్లు విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ సర్వే రిపోర్టు అంచనా వేసింది. గతేడాదిలో నమోదైన 5.9 శాతం సగటుతో పోలిస్తే జీతభత్యాల్లో కాస్త మెరుగు కనిపించనున్నట్లు పేర్కొంది. కార్పొరేట్‌ రంగం కరోనా సంక్షోభంతో కుదేలై తర్వాత భారీగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు విల్లీస్‌ టవర్స్‌ వాట్సన్‌ ఇండియా టాలెంట్‌ అండ్‌ రివార్డ్‌ సెక్షన్ ఆఫీసర్ రాజుల్‌ మాథుర్‌ అన్నారు. అదే స్థాయిలో శాలరీ పెంపు బడ్జెట్‌లో పెరుగుదల ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇండియాలో సర్వే చేసిన 37శాతం కంపెనీల్లో వచ్చే 12నెలల పాటు పాజిటివ్ బిజినెస్ జరిగేలా కనిపించింది. ఇండియాలో ఆర్గనైజేషన్స్ పుంజుకుని 10శాతం రిక్రూట్‌మెంట్లు జరుగుతాయని సర్వే వెల్లడించింది. రెగ్యూలర్ గానే.. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు వేతన పెంపులు అనేవి ఉంటాయని స్పష్టమైంది. ఈ ఏడాది వారికి సగటున 20.6 శాతం వేతన పెంపు ఉండవచ్చని రిపోర్ట్ అంచనా. ఈ కేటగిరీ కిందకు వచ్చే ఉద్యోగులు ఇండియాలో 10.3 శాతం మంది ఉన్నట్లు అంచనా.

‘శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ రిపోర్ట్‌’ పేరిట రూపొందించిన ఈ రిపోర్టు గతేడాది అక్టోబరు/నవంబరులో ఆన్‌లైన్‌ ద్వారా 130 దేశాలకు చెందిన 18వేల కంపెనీల ఏజెంట్ల నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్‌తో సర్వే చేశారు. ఇందులో పాల్గొన్న ఇండియన్ కంపెనీల్లో 37 శాతం.. వచ్చే సంవత్సర కాలంలో ఆదాయంపై సానుకూలంగా ఉన్నట్లు తేలింది. ఉద్యోగ నియామకాలు మాత్రం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. కేవలం 10 శాతం కంపెనీలు మాత్రమే కొత్త ఉద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఆసక్తి కనబరిచాయి.

ఇండియాతో పాటు మిగిలిన దేశాల్లో ఇలా:
ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని కీలక మార్కెట్లు అయిన ఇండోనేసియాలో 6.5 శాతం, ఫిలిప్పీన్స్‌లో 5 శాతం, చైనాలో 6 శాతం, హాంకాంగ్‌లో 3 శాతం, సింగపూర్‌లో 3.5 శాతం శాలరీ పెంచొచ్చని సర్వే వివరించింది. టెక్నికల్, మెడికల్, కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్ అండ్‌ రిటైల్ రంగాల్లోని ఉద్యోగులకు సగటున 8 శాతం జీతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఆర్థిక సేవలు, ప్రొడక్షన్ రంగాల్లో పని చేసే వారి వేతనాలు 7 శాతం, బీపీఓ సెక్టార్‌లో పని చేసే వారి వేతనం 6 శాతం, ఇంధన రంగంలో పని చేసే వారి వేతనం అత్యల్పంగా 4.6 శాతం పెరగొచ్చని సర్వే తెలిపింది.